● ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, చేసిన డిక్లరేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ధ్వజమెత్తారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని రైతుసదస్సు నిర్వహణ స్థలంలో రైతు సంగ్రామ సదస్సు పోస్టర్‌ను దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 420 హామీలు, 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని తూర్పారబట్టారు. కేసీఆర్ ఎకరాకు రైతుబంధు రూ.10 వేలు ఇస్తే, రేవంత్‌రెడ్డి రూ.12 వేలు ఇస్తానని చెప్పి మూడుసార్లు ఎగ్గొట్టాడని విమర్శించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు రైతుసదస్సు బీఆర్‌ఎస్ పెడితే పోటీగా కాంగ్రెస్ సభ పెడతామని అంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ వస్తున్నారు.. అంటే అధికార పక్షం భయపడుతోందన్నారు. రైతు రుణవిమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, పులి రజనీకాంత్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, డాక్టర్ హరి రమాదేవి, ప్రశాంత్, రామ్మూర్తి, మాచర్ల శరత్‌చంద్ర పాల్గొన్నారు.
టేకుమట్ల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లిలో చో టుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామకృష్ణాపూర్ (వి) గ్రామానికి చెందిన అప్పని లింగయ్య (50) ఆదివారం ఉదయం బైక్‌పై పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం స్వగ్రామం రామకృష్ణాపూర్ (వి)కు వ స్తుండగా బోర్నపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమూల్య తెలిపారు.


