వడ్డీల ఆశ చూపి రూ.కోటితో పరారీ
కాశిబుగ్గ: వరంగల్ 20వ డివిజన్ కాశిబుగ్గలో ఓ వ్యాపారి స్థానిక ప్రజల వద్ద నుంచి దాదాపు రూ.కోటి వసూలు చేసుకుని పరారైన ఉదంతం ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. ఈ వ్యాపారి తీరుపై శుక్రవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొ ట్టడంతో విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరశెట్టి సురేష్ అనే వ్యాపారి కాశిబుగ్గలో కిరాణం షాపు నిర్వహిస్తూ ప్రజలతో కలిసి మెలిసి ఉంటూ నమ్మకం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాల డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పదిహేను రోజుల క్రితం కిరాణం షాపునకు తాళం వేసి నాటి నుంచి కనిపించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
క్రీడాపాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపికలు
కాశిబుగ్గ: హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికలు ముందుగా మండల, జిల్లాస్థాయిలో ఎంపిక కావాల్సి ఉంటుందని, ఆన్‌లైన్‌లో ఈనెల 26 నుంచి మార్చి నాలుగో తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నా రు. విద్యార్థులు 1 సెప్టెంబర్, 2017 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించి ఉండాలని తెలి పా రు. ఐదు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, బర్త్, స్టడీ, కమ్యూనిటీ సర్టిఫికెట్, మూడో తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు, ఆధార్‌కార్డుతో రావాలని, ఇతర వివరా లకు ఎంఈఓలను సంప్రదించాలని తెలిపారు.


