ఆస్పత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 7:05 AM

ఆస్పత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి

ఆస్పత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి

వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కావ్య

కలెక్టర్‌తో కలిసి మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పరిశీలన

ఎంజీఎం : వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్‌ ఎంపీ కడి యం కావ్య నిర్మాణ సంస్థ, అధికారులను ఆదేశించారు. వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారదతో కలిసి శుక్రవారం ఆమె ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించా రు. ఆస్పత్రిలో ప్రధానంగా ఎమర్జెన్సీ సేవలు, 16 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్న బెడ్లకు ఆక్సిజన్‌ లైన్లు, ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థ, సెంట్రల్‌ ఏసీ లైన్‌, విద్యు త్‌ సరఫరా, నీటి పైప్‌లైన్‌ కనెక్షన్లు, కేన్సర్‌ విభా గానికి రేడియేషన్‌ థెరపీ కోసం ప్రత్యేక బంకర్లు, ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ సేవలు, ఆడిటోరియం, ఆపరేషన్‌ థియేటర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌ స్థాయి వైద్యసేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయని ఎంపీ కావ్య తెలిపారు. అనంతరం ఆస్పత్రి అభివృద్ధి ప నుల పురోగతిపై అధికారులతో నిర్వహించిన స మావేశంలో కావ్య మాట్లాడుతూ.. రోగులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆస్పత్రికి సరిప డా డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాఘవరెడ్డి, ఈఈ రాజేందర్‌, ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శ్రవణ్‌కుమార్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీశ్‌ చంద్రారెడ్డి, ఆర్‌ఎంఓ అశ్విన్‌కుమార్‌, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ గీతం రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ (ఎలక్ట్రికల్‌) నర్సయ్య , ఏఈ (జీడబ్ల్యూఎంసీ) రవికుమార్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement