భద్రకాళికి నటుడు అడవి శే షు పూజలు | - | Sakshi
Sakshi News home page

భద్రకాళికి నటుడు అడవి శే షు పూజలు

Feb 27 2026 4:03 AM | Updated on Feb 27 2026 4:03 AM

భద్రకాళికి నటుడు  అడవి శే షు పూజలు

భద్రకాళికి నటుడు అడవి శే షు పూజలు

భద్రకాళికి నటుడు అడవి శే షు పూజలు క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇప్పించండి

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయాన్ని గురువారం సినీనటుడు అడవి శేషు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్‌, అర్చకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. శేషు అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, హనుమకొండలో ఉన్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్‌ అశోక్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు https:///tgss.telangana.gov. inలో రిజి స్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. మూడో తరగతి పూర్తి చేసుకుని 1 సెప్టెంబర్‌ 2017 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్‌స్టార్ట్‌, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, 800 మీటర్ల పరుగు, 610 మీటర్ల షటిల్‌రన్‌, మెడిసిన్‌ బాల్‌త్రో, వర్టికల్‌ జంప్‌, ఫ్లెక్సిబిలిటీ తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు ప్రస్తుత పాఠశాల నుంచి బోనోఫైడ్‌, 3వ తరగతి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, తహసీల్దార్‌, గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు జారీ చేసిన జనన, కులధ్రువీకరణ పత్రాలు, 10 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌, ఒరిజినల్‌ పత్రాలు వెంట తీసుకురావాలని కోరారు. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండలస్థాయి, మార్చి 28 నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు జిల్లాస్థాయి, ఏప్రిల్‌ 27 నుంచి మే1 వరకు రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

నాభర్త ప్రాణాలు కాపాడండి

ముఖ్యమంత్రికి రిటైర్డ్‌ ఏఎస్సై

భార్య వేడుకోలు

వరంగల్‌ క్రైం: పోలీస్‌ శాఖలో సుమారు 40 ఏళ్లు పనిచేసి రిటైర్మెంట్‌ అయిన నా భర్త ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇప్పించాలని రిటైర్డ్‌ ఏఎస్సై వీవీఎల్‌ఎన్‌ మూర్తి భార్య విజయలక్ష్మి ముఖ్యమంత్రిని వేడుకుంటోంది. వాట్సాప్‌లో ఆమె అభ్యర్థన వైరల్‌గా మారింది. గతేడాది రిటైర్డ్‌ అయిన మూర్తికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌ అందలేదు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు తెచ్చిన అప్పులు భారంగా మారడంతోపాటు భర్త తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె పేర్కొంది. ఇంటి కిరాయి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చేరే విధంగా అధికారులు సహకరించాలని విజయలక్ష్మి కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement