చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి

Feb 26 2026 9:34 AM | Updated on Feb 26 2026 9:34 AM

చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి

చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి

చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

వరంగల్‌ అర్బన్‌: ఇంటింటా చెత్త సేకరణలో సమయపాలన పాటించాలని, సెకండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు నిర్ణీత సమయంలో వాహనాలు చేరుకోవాలని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. హనుమకొండలోని బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్‌ షెడ్‌కు చేరే స్వచ్ఛ ఆటోలు, వాహనాలు తడి, పొడి చెత్తను వేరు గా తీసుకొస్తున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరమ్మతు చేయాల్సిన వాహనాలు ఎన్ని ఉన్నాయి, షెడ్‌లో కాంఫ్యాక్టర్ల స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, వివిధ శానిటేషన్‌ వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎంహెచ్‌ఓను ఆదేశించారు. వాహన మరమ్మతులను సకాలంలో చేపట్టాలని ఈఈకి సూచించారు. తనిఖీల్లో ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, ఈఈలు మాధవీలత, మహేందర్‌, డీఈ రాజ్‌కుమార్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ నరేందర్‌ పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు..

ఆక్రమణలు, అనుమతి లేని నిర్మాణాలపై సీరియస్‌గా దృష్టి సారించాలని కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు. అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రీవెన్స్‌ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, ఏసీపీలు ఖలీలొద్దీన్‌, శ్రీనివాస్‌రెడ్డి, ప్రశాంత్‌, నుస్రత్‌, రజిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement