పార్కు స్థలం కబ్జాకు యత్నం! | - | Sakshi
Sakshi News home page

పార్కు స్థలం కబ్జాకు యత్నం!

Feb 26 2026 9:34 AM | Updated on Feb 26 2026 9:34 AM

పార్కు స్థలం  కబ్జాకు యత్నం!

పార్కు స్థలం కబ్జాకు యత్నం!

పార్కు స్థలం కబ్జాకు యత్నం!

నగరం నడిబొడ్డున విలువైన 450 గజాల భూమి

డాక్యుమెంట్లు పట్టుకుని ఈ స్థలం చుట్టూ

తిరుగుతున్న నలుగురైదుగురు

కబ్జాలో భాగంగా బోరు వేసిన

ఆక్రమణదారులు.. అడ్డుకున్న స్థానికులు

హన్మకొండ: హనుమకొండ 59వ డివిజన్‌ పరిధి ఎకై ్సజ్‌ కాలనీలో విలువైన కార్పొరేషన్‌ పార్కు స్థలం కబ్జాకు కొందరు వ్యక్తులు తీవ్రంగా యత్నిస్తున్నారని కాలనీవాసులు తెలిపారు. రూ.కోట్ల విలువ చేసే ఈ స్థలం కబ్జాకు నలుగురైదురు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు చెబుతున్నారు. ఈ నెల 24న కొందరు వ్యక్తులు ఆ స్థలంలో బోరు తవ్విస్తుండగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. స్థానిక కార్పొరేటర్‌ గుజ్జుల వసంత.. సుబేదారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ కుమార్‌ అక్కడికి చేరుకున్నారు. భవన నిర్మాణానికి అనుమతి ఉంటేనే బోరు వేయాలని, అనుమతి పత్రాలు చూపించాలని వారు కోరగా త్వరలో పర్మిషన్‌ వస్తుందని కబ్జాదారులు బదులిచ్చారు. పర్మిషన్‌ వచ్చిన తర్వాతనే బోరు తవ్వాలని పోలీసులు, కార్పొరేటర్‌ ఆదేశించడంతో కబ్జాదారులు వెళ్లిపోయారు.

ఇప్పటికే కొంతభాగం ఆక్రమణ..

పార్కు స్థలం దాదాపు 450 గజాలుంటుందని, దీని విలువ రూ.2కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. స్థలంలో కొంతభాగం ఇప్పటికే కొందరు ఆక్రమించుకుని భవనాలు నిర్మించుకున్నారని, ఇందులో ఒకరు ఓ భవనాన్ని అమ్మకానికి పెట్టారని స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement