పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 25 2026 10:44 AM | Updated on Feb 25 2026 10:44 AM

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ రామకృష్ణారావు

కాళోజీ సెంటర్‌/హన్మకొండ అర్బన్‌: టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హనుమకొండ, వరంగల్‌ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు స్నేహ శబరీష్‌, సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, రవి, ఇంటర్‌ విద్యాశాఖ అధికారులు గోపాల్‌, డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌, డీఈఓలు గిరిరాజగౌడ్‌, బి.రంగయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ పరీక్షల కోసం విద్య, వైద్య, పోలీస్‌ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement