ఆధునిక శతావధానిగా చేపూరి శ్రీరాం
కేయూ క్యాంపస్: లెక్కల మాస్టారు చేపూరి శ్రీరాం తెలుగుభాషపై వచన పద్యకవిత్వం, సాహిత్యంపై మక్కువ పెంచుకుని ప్రవృత్తిగా అవధానాలు చేస్తూ వచ్చిన ఆయన శతావధానం ప్రక్రియను మంగళ వారం విజయవంతంగా పూర్తిచేశారు. కేయూ సెనేట్‌హాల్‌లో శతావధానం ప్రక్రియలో మూడో రోజు ఽ75 చందోబద్ధ పద్యాలను ధారణ చేశారు. కంది శంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో మొదటిరోజు 25 సమస్యాపూరణలు, 25 దత్తపదులు, రెండో రోజు 25 వర్ణణలు, 25 ఆశువులు కూడా పూర్తిచేశారు. దీంతో ఇప్పటినుంచి శ్రీరాంను ‘శతావధాని చేశ్రీగా’ పిలుస్తారని నిర్వాహకులు, పృచ్చకులు (ప్రాశ్నికులు)ప్రకటించారు. ఈ సందర్భంగా వీసీ కె.ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ బహువిద్యలో సమాహారం నైపుణ్యాల సమ్మేళనమే శతావధానమని పేర్కొన్నారు. తెలుగు ప్రాచీన, సజీవ భాష అని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ అన్నారు. అనంతరం అతిథులు, నిర్వాహకులు.. చేపూరి శ్రీరాం, విజయ దంపతులను సత్కరించారు. కాకతీయ పద్యకవితావేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య, అవధాన పద్యవికాస పరిషత్ అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయశర్మ,కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, తెలుగు విభాగం అధిపతి మామిడి లింగయ్య, అధ్యాపకుడు కర్రె సదాశివ్, ఉదయమని కృష్ణయ్య,దర్శనం వెంకట్‌రమణశర్మ పృచ్చకులు పాల్గొన్నారు.
ఆద్యంతం ఆసక్తికరంగా శతావధానం
75 చందోబద్ధపద్యాలనుధారణ
ఇక నుంచి‘చేశ్రీగా’ పిలవాలని నిర్ణయం


