అండర్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి
వరంగల్ ఆర్డీఓ సుమ
ఖిలా వరంగల్: వరంగల్ 17వ డివిజన్‌లోని ఆదర్శనగర్ రైల్వేగేట్ వద్ద రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన అండర్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలని వరంగల్ ఆర్డీఓ సుమ సూచించారు. కుడా పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, రైల్వే జేఈ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, కార్పొరేటర్ గద్దె బాబు, రైల్వే కాంట్రాక్టర్ ప్రసాద్‌రెడ్డితో కలిసి ఆదర్శనగర్‌ను సందర్శించారు. నిధులు విడుదలైనా పనుల జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికులు ఆమెకు సమస్యలు వివరించారు. ఇరుకుగా మారిన అండర్ బ్రిడ్జితో అనేక ఇబ్బందులు ఉన్నాయని, భవిష్యత్ రాకపోకలకు అనుకూలంగా అండర్ బ్రిడ్జి నిర్మించాలని, తక్షణమే రీసర్వే చేపట్టాలని ఆర్డీఓను కోరారు. బ్రిడ్జి నిర్మాణంపై త్వరలోనే రైల్వే అధికారులతో చర్చించి ప్రజలకు న్యాయం చేస్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఆర్‌ఐ కీర్తన్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోపగాని శంకర్, ప్రధాన కార్యదర్శి షేక్‌మాశుక్, గౌరవ అధ్యక్షుడు ఎండీ జానీ, రావుల యాదగిరి, హిమయతుల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల రాజు, తాజొద్దీన్, మాజీ ఎంపీటీసీ షమీంబేగం, ఉపాధ్యక్షులు సలీం, గఫూర్, రబ్బానీ, ఎండీ అఫ్జల్, రవీందర్, నర్సింహారెడ్డి, జానీ, రహ్మత్, వేణు, షబ్బీర్, ఇమ్రాన్, మసూద్, రాజేశ్, కరుణాకర్ పాల్గొన్నారు.


