దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు.. | - | Sakshi
Sakshi News home page

దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..

Feb 25 2026 10:44 AM | Updated on Feb 25 2026 10:44 AM

దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..

దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..

ఏటూరునాగారం–మహదేవపూర్‌ ప్రాంత దళంలో పార్టీ సభ్యుడిగా చేరిన దామోదర్‌, 1999లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ అయ్యి అక్కడ దళ కమాండర్‌ దిలీప్‌ నాయకత్వంలో పనిచేశారు.

ఆ తర్వాత 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్‌గా, 2001లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్‌గా, 2003లో మేడారం ఎల్‌ఓఎస్‌ ఇన్‌చార్జ్‌గా, 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం – మహదేవపూర్‌ ప్రాంతానికి నియమితులయ్యారు.

2006లో ఖమ్మం–కరీంనగర్‌–వరంగల్‌ (కేకేడ బ్ల్యూ) డివిజనల్‌ కమిటీ సభ్యుడు, 2007లో డివి జనల్‌కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు.

2009లో డివిజనల్‌ కమిటీ కార్యదర్శి పనిచేసి, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్‌సీఎం) గా పదోన్నతి పొంది, అదే సమయంలో కేకేడబ్ల్యూ డివిజనల్‌ కమిటీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు.

మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమితులైన దామోదర్‌.. యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మరణం తర్వాత ఆయన స్థానంలో జనవరి 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు.

అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో కలిసే వరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement