పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి

Feb 24 2026 9:07 AM | Updated on Feb 24 2026 9:07 AM

పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి

పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి

పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌ గౌడ్‌

హన్మకొండ: పార్టీ విధానాలు, సిద్ధాతాలపై ప్రతీ కార్యకర్తకు అవగాహన ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం హనుమకొండ దీన్‌దయాళ్‌ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ హనుమకొండ జిల్లా ప్రశిక్షణ అభియాన్‌–2026 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తూళ్ల వీరేందర్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. 2028లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి శిక్షణ శిబిరాలు మార్చి 7 నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఐదు వారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బూత్‌ కమిటీలను మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు డాక్టర్‌ విజయ్‌ చందర్‌రెడ్డి, సండ్ర మధు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement