మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
సిబ్బంది
ఎంతమందంటే..
చీఫ్ సూపరింటెండెంట్లు: 52 మంది,
అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు 42.
డిపార్టుమెంటల్ ఆఫీసర్లు 52 మంది. ఫ్లయింగ్ స్క్వాడ్లు: 3, సిట్టింగ్ స్క్వాడ్లు: 4
పకడ్బందీగా నిర్వహిస్తాం..
హనుమకొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. సీఎస్‌లకు, డీఓలకు ఇప్పటికే పలు సూచనలిచ్చాం. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి సదుపాయాలు కల్పించనున్నాం. మాల్ ప్రాక్టీస్‌కు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవు. ఏమైనా పిర్యాదులు, సందేహాలకు డీఐఈఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ 93816 72094, 95027 43435 ఫోన్ చేయవచ్చు.
– గోపాల్, డీఐఈఓ, హనుమకొండ
టెక్నాలజీతో పకడ్బందీగా..
ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా డౌన్‌లోడ్ చేసిన హల్‌టికెట్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులుంటాయి. సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి గురైతే 14416 టోల్‌ఫ్రీ నంబర్‌కు సంప్రదించవచ్చు. ఏమైనా ఇతర సమస్యలుంటే వరంగల్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్:
99668 88118 (ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు), 89770 81640 (మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు) నంబర్లలో సంప్రదించవచ్చు. – శ్రీధర్, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు
అధికారి, వరంగల్
వరంగల్ జిల్లాలో.. పరీక్షా కేంద్రాలు: 26 (ప్రభుత్వ కాలేజీలు 10, ఎయిడెడ్ 4, సెక్టార్ 5, ప్రైవేట్ 7) ప్రశ్నపత్రాల నిల్వకోసం స్టోరేజీ సెంటర్లు: 11 పోలీసు స్టేషన్లు, సీసీటీవీ కెమెరాలు: 240. సిబ్బంది ఎందరంటే: ఇన్విజిలేటర్లు: 380, ఫ్లయింగ్ స్క్వడ్‌లు: 1, సిట్టింగ్ స్క్వడ్‌లు: 4, కస్టొడియన్స్: 4, చీఫ్ సూపరింటెండెంట్‌లు: 26, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు: 26, పోలీసు సిబ్బంది: 52, వైద్య సిబ్బంది: 52 (ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అవసమైన మందులు ఉంటాయి)
కోడ్ దారి చూపిస్తుంది
గతంలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న సెంటర్ లోకేటర్ యాప్‌లో సెంటర్ కోడ్ టైప్ చేస్తే ఆయా పరీక్షా కేంద్రాలకు దారి చూపేది. ఇది వాడే క్రమంలో చాలా మందికి
గతేడాది ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని దృష్టిలో
ఉంచుకొని ఈసారి ఆయా కేంద్రాల గూగుల్ జియో
కో ఆర్డినేట్స్ తీసుకొని మరీ హాల్ టికెట్‌పై
క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. ఈ క్యూఆర్ కోడ్‌ను
గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేస్తే నేరుగా
ఆ కేంద్రానికి తీసుకెళ్లనుంది.
హనుమకొండ
జిల్లాలో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య
సంవత్సరం జనరల్ ఒకేషనల్
ఫస్టియర్ 17,463 1,133
సెకండియర్ 18,968 1,036
ఫస్టియర్ 5210 793
సెకండియర్ 5356 807
వరంగల్
జిల్లాలో
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


