సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

హన్మకొండ: రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ విమర్శించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10శాతం పనులు రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని దుయ్యబట్టారు. మాజీ మంత్రి హరీశ్‌రావు దేవన్నపేట పర్యటనతోనే సీఎం రేవంత్‌రెడ్డిలో కదలిక వచ్చిందని, గాలిలో దేవాదులకు వచ్చి గాలి మాటలు మాట్లాడి వెళ్లారని తూర్పారబట్టారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ కేరళలో జరిగే ఎన్నికల ఫండ్‌ కోసం మాత్రమే దేవాదుల నిర్మాణంపై ఈ సమీక్షిస్తున్నారని, దేవాదుల మూడో ఫేజ్‌ నిర్మాణ వ్యయాన్ని రూ.17వేల కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. పెంచిన రూ.7వేలకోట్లతో కాంట్రాక్టర్‌నుంచి కాంగ్రెస్‌ రూ.వేల కోట్లు దండుకోనుందని ఆరోపించారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనందుకు మరోసారి పిండాలు పెట్టె కార్యక్రమాలు చేయబోతున్నామన్నారు. సమావేశంలో నాయకులు నాగూర్ల్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, జోరిక రమేష్‌, పులి రజనీకాంత్‌, జానకి రాములు, చందర్‌, అఫ్జల్‌, మటపెల్లి రమేష్‌, నార్లగిరి రమేష్‌, జనార్దన్‌ గౌడ్‌, దశరథం, రఘు, నయీమొద్దీన్‌, కోటిలింగం, వినోద్‌ కుమార్‌, రామ్మూర్తి, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌ రాకతో

సీఎం రేవంత్‌లో కదలిక

బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా

అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌

Advertisement
 
Advertisement
Advertisement