హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ | - | Sakshi
Sakshi News home page

హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

Dec 20 2025 6:50 AM | Updated on Dec 20 2025 6:50 AM

హనుమక

హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ ఏపీకి కానిస్టేబుళ్ల బదిలీ 22న జిల్లా స్థాయి క్రాస్‌ కంట్రీ పోటీలు 23న రెడ్‌ క్రాస్‌ సర్వసభ్య సమావేశం నేడు పాఠశాలల్లో ‘పీటీఎం’

వరంగల్‌ లీగల్‌: హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ పట్టాభిరామారావును హైదరాబాద్‌ సీబీఐ కోర్ట్‌ చీఫ్‌జడ్జీగా బదిలీ చేస్తూ హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మొదటి అదనపు జిల్లా జడ్జి ఇన్‌చార్జ్‌గా ఉంటారు. సోమవారం వరకు రిలీవ్‌ కావాలని, ఈ నెల 29 వరకు బదిలీ అయిన స్థానంలో బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మామునూరు: వరంగల్‌ మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌కు చెందిన స్పెషల్‌ కానిస్టేబుళ్లు శుక్రవారం నోటిఫికేషన్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. ఈమేరకు ఏపీ రాష్ట్రానికి కేటాయించబడిన స్పెషల్‌ కానిస్టేబుళ్లను రిలీవ్‌ చేస్తూ కమాండెంట్‌ శివప్రసాద్‌రెడ్డి సిబ్బందిని అభినందించారు. తెలంగాణలో విధులు నిర్వర్తించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మంచి చేయాలని సూచించారు. విధుల్లో పేరు ప్రతిష్టతలు పెంచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 22వ తేదీన హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో జిల్లా స్థాయి క్రాస్‌ కంట్రీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.సారంగపాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌–16, 18, 20, మెన్‌ అండ్‌ ఉమెన్‌ విభాగాల్లో ఎంపికలు నిర్వహించున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎంపిౖకైన క్రీడాకారులు జనవరి 2, 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న 11వ రాష్ట్ర స్థాయి క్రాస్‌ కంట్రీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. విజేతలకు పతకాలు, మెరిట్‌ సర్టిఫికెట్లతో పాటు, పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 22న ఉదయం 8గంటలకు జేఎన్‌ఎస్‌ వద్ద జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సారంగపాణి 93901 04499, సాంబమూర్తి 99120 22188, రజనీకాంత్‌ 70133 03330 మొబైల్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

హన్మకొండ అర్బన్‌: ఈనెల 23న (మంగళవారం) ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం రెడ్‌ క్రాస్‌ భవన్‌లో జిల్లా పాలకవర్గ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం హనుమకొండ కలెక్టర్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన బుక్‌లెట్‌ను కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేయగా.. డీఎంహెచ్‌ఓ అప్పయ్య లబ్ధిదారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ విజయచందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పెద్ది వెంకటనారాయణ గౌడ్‌, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు, టీబీ నివారణాధికారి హిమబిందు, రెడ్‌ క్రాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో కేజీబీవీల్లో, మోడల్‌ స్కూళ్లలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు (పీటీఎం) సమావేశాలు ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈసారి నిర్వహించే సమావేశంలో పిల్లల కోసం ప్రత్యేక వంటకాలు(పోషకాహారం) చేసుకుని తీసుకురావాలని తల్లిదండ్రులకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. పోషకాహారోత్సవాన్ని పాఠశాలల్లో వినూత్నంగా చేపట్టాలని నిర్ణయించినట్లు హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్‌ కో–ఆర్డినేటర్‌ బద్దం సుదర్శన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ1
1/2

హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ2
2/2

హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement