వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. ఎన్‌టీఆర్‌నగర్, బాలాజీనగర్, లక్ష్మీగణపతి, శ్రీసాయిగణేశ్‌కాలనీ, ముసలమ్మకుంట ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులు పెట్టి ముఖ్యమైన ఏనుమాములకు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెట్టలేదంటూ స్థానిక ప్రజలు.. ఎమ్మెల్యే నాగరాజును ప్రశ్నించారు. 14వ డివిజన్‌లో సుమారు రూ.7.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఏనుమాములకు వచ్చారు. గెలిచి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. డివిజన్‌లో ముఖ్యమైన ఏనుమాములను విస్మరించడం సరికాదని ఎమ్మెల్యేతో స్థానికులు అనడంతో శ్రీనాకు తెలియదు. మీ నాయకులు వివరాలు ఇవ్వాల్సి ఉందిశ్రీ అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. సమస్యలను చెప్పుకునేందుకు ఒంటరిగా మీ దగ్గరికి వస్తే పట్టించుకోవడం లేదని, ఎంతో అవసరమైన ఏనుమాముల శ్మశానవాటికకు కూడా నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈవిషయాలు తన దృష్టికి రాలేదని, భవిష్యత్‌లో మీ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రజలను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే నాగరాజు పర్యటనలో మూడు వాహనాలు, ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 10మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉండడాన్ని గమనించిన పలువురు మంత్రి పర్యటన కంటే ఎక్కువ బందోబస్తు ఉందన్న చర్చించుకోవడం గమనార్హం. కాగా, డివిజన్‌లో అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్పిందే పోలీస్ స్టేషన్, ఇతర కార్యాలయాల్లో జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే నాగరాజును కలవనీయకుండా చుట్టూ ఉంటున్న నాయకులే అడ్డుపడుతున్నారని స్థానికులు వాపోయారు.
పోలీసుల వేధింపులు
డివిజన్‌లో అధికార పార్టీ నాయకులు తమకు అడ్డుగా ఉన్న నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక నాయకుడిని స్టేషన్‌లో పెట్టించి కొట్టించిన ఘటనలున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒక గ్రామానికి వెళ్లగా అడ్డుకున్న వీడియో వైరలైంది. ఈ వీడియోను 14వ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోగా కాంగ్రెస్ నాయకుడి ఆదేశంతో ఏనుమాముల ఎస్సై పిలిపించి బెదిరించడమే కాకుండా బూతు పురాణం చేసిన ట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. అంతేకాకుండా సాయంత్రం రావాలని ఆదేశించడంతో నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది.
అభివృద్ధి నిధులపై ప్రశ్నించిన 14వ డివిజన్ ఏనుమాముల ప్రజలు


