 
															సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్‌కు కేయూ ఉమెన్స్ జట్టు
కేయూ క్యాంపస్: తమిళనాడులోని వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఈనెల 29 నుంచి నుంచి నవంబర్ 2వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ కబడ్డీ జట్టు పాల్గొంటుందని స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. జట్టులో సీహెచ్.వైష్ణవి (తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల, వరంగల్), డి.సునీత (టీజీటీడబ్ల్యూఆర్‌డీసీ, మహబూబాబాద్), యు.సంజన (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపేట), బి.భార్గవి (ఎంజేపీటీ బీసీ, ఖమ్మం), ఎస్.అక్షర (కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ), పి.శిరీష (వీఐపీఎస్, బొల్లికుంట), జె.జ్యోతి (ఎంజేపీటీడబ్ల్యూ ఆర్‌డీసీ, స్టేషన్‌ఘన్‌పూర్), బి.విద్యశ్రీ (టీజీటీడబ్ల్యూ ఆర్‌డీసీ, కొత్తగూడెం), జి.కావ్యశ్రీ (టీజీడబ్లూ ఆర్‌డీసీ, ఖమ్మం), బి.దివ్య (ఎల్‌బీ కళాశాల, వరంగల్), పి.శారద (యూసీపీఈ, ఖమ్మం), వై.అనిత (వీసీపీఈ, బొల్లికుంట), జి. హారిక (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), ఎస్.అఖిల (టీజీటీడబ్ల్యూ ఆర్‌డీసీ , దమ్మన్నపేట) ఉన్నారు. జట్టుకు కోచ్‌గా వరంగల్ కిట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్‌గా వాగ్డేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.అజయ్ వ్యవహరిస్తున్నారని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
