
మైక్రోలైట్ విమానంలో ఎయిర్‌వింగ్ శిక్షణ
ఎన్‌సీసీ కేడెట్ల గగన విహారం
మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయంలో తెలంగాణ 4వ ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం మైక్రోలైట్ విమానంలో ఎన్‌సీసీ కేడెట్లు ఉత్సాహంగా గగనంలో విహరించారు. మైక్రోలైట్ విమాన పనితీరు తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా ఎయిర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, వింగ్ కమాండర్ ఆశిష్ ధనాకే హాజరై మైక్రోలైట్ విమానంలో సంచరిస్తూ ఎన్‌సీసీ కేడెట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో ఎన్‌సీసీ కేడెట్ల సేవల్ని దేశం కోసం ఉపయోగిస్తామని, అందుకే ఎయిర్ వింగ్ శిక్షణ ఇస్తున్నట్లు కమాండర్ ఆశిష్‌ధనాకే తెలిపారు. శిక్షణలో వర్ధన్నపేట జిల్లా పరిషత్ పాఠశాల ఎన్‌సీసీ ఆఫీసర్ నిమ్మ మనుజేందర్‌రెడ్డి, సార్జెంట్ రెడ్డి, సార్జెంట్ రాయ్, సుమాన్ సింగ్, హెచ్‌ఎం కాయిత శ్రీనివాస్, ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు.