
మార్కెట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: పత్తి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మద్దతు ధరలకు విక్రయించేలా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఒక హెల్ప్‌డెస్క్ వెంటనే ఏర్పాటు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మార్కెట్‌ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, యార్డుల్లోని పంట ఉత్పత్తులు పరిశీలించారు. పత్తికి తేమ శాతం ఎక్కువున్నా ఽమద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని, మార్కెట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాని చాంబర్ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 2025–26 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల పోస్టర్లను మార్కెట్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, గ్రేడ్–2 కా ర్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్‌రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కోశాధికారి అల్లె సంపత్, కార్యవర్గ సభ్యులు గౌరిశెట్టి శ్రీనివాస్, కాటన్ సెక్షన్ కార్యదర్శి కట్కూరి నాగభూషణం, వ్యాపారులు, మార్కెట్ ఉద్యోగులు న్నారు.
ఇబ్బందులు రావొద్దు
న్యూశాయంపేట: రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్‌చార్జ్ డీఆర్‌డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఓ నీరజ, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ, ఆర్టీఓ శోభన్, లీగల్ మెట్రాలిజీ అధికారి మనోహర్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, కోశాధికారి ఇరుకు కోటేశ్వర్‌రావు, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లేఔట్లకు అనుమతి మంజూరు
జిల్లా పరిధిలోని లేఔట్ అనుమతుల కోసం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్‌లో లేఔట్ కమిటీ సమావేశం జరిగింది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఒక లేఔట్, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు అనుమతుల కోసం ప్రతిపాదనలను కమిటీ పరిశీలించి అనుమతి మంజూరు చేసింది. ఇందులో అధికారులున్నారు.