
సబ్ స్టేషన్ సామర్థ్యం పెంపు
హన్మకొండ : మెరుగైన విద్యుత్ సరఫరాకు సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంచుతున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ (ఆపరేషన్) డైరెక్టర్ టి.మధుసూదన్ పేర్కొన్నారు. శనివారం హనుమకొండలోని నిట్ 33/11 కేవీ సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచారు. ఈ సబ్ స్టేషన్‌లో అదనంగా 8 ఎం.వీ.ఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయగా ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్‌తో కలిసి మధుసూదన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, డీఈ జి.సాంబరెడ్డి, దర్శన్ కుమార్, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.