దరఖాస్తులు పెండింగ్‌ ఎందుకున్నాయి? | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు పెండింగ్‌ ఎందుకున్నాయి?

Jun 24 2025 3:17 AM | Updated on Jun 24 2025 3:17 AM

దరఖాస

దరఖాస్తులు పెండింగ్‌ ఎందుకున్నాయి?

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించిన ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రీవెన్స్‌ జరుగుతున్న క్రమంలో కొద్దిసేపు ఆపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం వరకు శాఖల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి ఒక్కో అధికారిని వివరాలు అడిగారు. పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్న శాఖల వారిని పిలిచి ‘మీ శాఖకు వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసా? ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి.. మీరేం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని, ఇకపై పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌.. సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి అడిగారు. కొన్ని మండలాలకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడాల్సిన అవసరం రావడంతో వెబ్‌ కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని పలు సూచనలు చేశారు. వినతులు పరిశీలించి విచారణ చేపట్టి నాలుగు రోజుల్లోగా పరిష్కారం చూపాలని, పరిష్కారం కాకపోతే ఆ విషయం దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. అలాగే సమస్య ఏ స్థాయిలో పరిష్కార దిశలో ఉంది? అనే విషయం ఆన్‌లైన్‌లో కనిపించేలా అప్డేట్‌ చేయాలని, ఏ అధికారి వద్ద ఫిర్యాదు ఆగిందో ఆ అధికారి పేరు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

అధికారులను ప్రశ్నించిన హనుమకొండ కలెక్టర్‌

గ్రీవెన్స్‌లో వెబ్‌ కెమెరాలు చూస్తూ..

అర్జీలను పరిశీలించిన

స్నేహ శబరీష్‌

దారి చూపండి..

దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వండి

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్లే దారిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారు. నక్షాలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు దారి ఉంది. ఆ దారిని కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకుని పొలాలకు చదును చేశారు.. వారిపై చర్యలు తీసుకుని పొలాలకు దారి చూపండి అంటూ.. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది రైతులు వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారదను వేడుకున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు నీరజ, విశ్వప్రసాద్‌, జ్ఞానేశ్వర్‌, అనసూయ, పుష్పలత, తహసీల్దార్లు ఇక్బాల్‌, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తులు పెండింగ్‌ ఎందుకున్నాయి?1
1/1

దరఖాస్తులు పెండింగ్‌ ఎందుకున్నాయి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement