
నిబంధనల మేరకే ఎంటీపీ కిట్ వినియోగించాలి
ఎంజీఎం: గైనకాలజిస్టుల పర్యవేక్షణలో, చట్టంలో సూచించిన గైడ్‌లైన్స్ ప్రకారమే ఎంటీపీ కిట్ విని యోగించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించా రు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ గైనకాలజిస్ట్ అసోసియేషన్, ఔషధ నియంత్రణ విభాగం, ఆర్‌ఎంపీ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. మెడికల్ షాపుల యజమానులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా అమ్మకూడదని, అలాగే ఎవరికి అమ్ముతున్నారో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికే ఈ విషయంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు సర్క్యూలర్ జారీ చేసినట్లు తెలి పారు. డీఎంహెచ్‌ఓ ద్వారా అనుమతి పొందిన హాస్పిటల్స్ మాత్రమే ఎంటీపీ నిర్వహించాలని ఆదేశించారు. సొంతంగా ఎంటీపీ కిట్ వినియోగం వల్ల వచ్చే అనర్థాల గురించి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌత మ్ చౌహన్, గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, ఐఎంఏ ఉపాధ్యక్షుడు నరేశ్‌కుమార్, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి మంజుల, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ ప్రసన్నలక్ష్మి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్,జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, ఔషధ నియంత్రణ విభాగం సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆర్‌ఎంపీ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి టి.సుమలత, రాజేశ్వర్‌రెడ్డి సుప్రియ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య