
వన మహోత్సవానికి సిద్ధం చేయండి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సంబంధిత శాఖల అధికారులు మొక్కలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వన మహోత్సవ మొక్కలను సిద్ధం చేయడంపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలను తీసి సిద్ధంగా ఉంచాలని, వాటి సంరక్షణకు చేయాల్సిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు నిరుద్యోగ, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో దరఖాస్తుల కరపత్రాన్ని అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకుండా ఉన్న వారు http://trrtudycirc e.co.in వెబ్ సైట్ ద్వారా జూలై 7 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవా లని కోరారు. జూలై 13న ఎంపిక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్‌లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల పాటు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్‌ఓ వై.వి.గణేశ్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీనివాస్, షెడ్యుల్డ్ కులా ల అభివృద్ధి సంస్థ అధికారి నిర్మల, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
అధికారులతో సమీక్ష