
శ్రమశక్తి అవార్డు గ్రహీతలకు సన్మానం
ఖిలా వరంగల్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శ్రమశక్తి అవార్డు అందుకున్న తూర్పుకోటకు చెందిన బిల్లా శ్రీకాంత్‌ను నగర వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ ఆదివారం సన్మానించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి శ్రీకాంత్ కృషి చేస్తున్న తీరును పలువురు ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తూ చేయూతనివ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధులు భూమయ్య, ఎండీ.రబ్బానీ, ఆశీర్వాదం, పోలెపాక ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
దేవులపల్లి రాఘవేందర్‌కు..
కాజీపేట రూరల్: ఇటీవల ప్రభుత్వం నుంచి శ్రమశక్తి అవార్డు అందుకున్న తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్‌ను కాజీపేట రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో రైల్వే జేఏసీ నాయకులు ఆదివారం సన్మానించారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు, రైల్వే జేఏసీ నాయకులు వస్కుల రవీందర్, ఎస్.హరిబాబు, బి.రాజేష్, టి.నాగేందర్, కె.మధు పాల్గొన్నారు.

శ్రమశక్తి అవార్డు గ్రహీతలకు సన్మానం