
అవార్డు అందుకుంటున్న కిరణ్‌కుమార్
స్టేషన్‌ఘన్‌పూర్: బెస్ట్ పెర్ఫార్మర్ ఇన్ కన్స్యూ మర్ రైట్స్–2023 అవార్డును డివిజన్ కేంద్రానికి చెందిన బత్తిని కిరణ్‌కుమార్‌గౌడ్ అందుకున్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్‌సీఆర్‌సీ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎంవీఎల్ నాగేశ్వరరావు చేతుల మీదుగా కిరణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిరణ్‌కుమార్‌గౌడ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని, సేవా కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో విస్తృతం చేస్తానని ఈ సందర్భంగా కిరణ్ చెప్పారు.