మురుగు నీటికి అడ్డు తొలగింపు
తాడేపల్లి రూరల్ : కుంచనపల్లి బైపాస్ రోడ్డులో గల ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పంట కాలువకు అడ్డుకట్ట తొలగించడంతో మురుగునీరు మొత్తం బయటకు వెళ్లిపోయింది. బుధవారం సాక్షిలో ముంచెత్తుతున్న మురుగునీరు, పొంగిపొర్లుతున్న ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ కథనం వెలువడింది. దీనికి స్పందించిన కార్పొరేషన్ అధికారులు ప్రాతూరు, కుంచనపల్లి మధ్య కాలువకు రైతులు అడ్డంగా వేసిన కట్టను తొలగించారు.దీంతో ఒక్కసారిగా మురుగు నీరు మొత్తం కిందకు వెళ్లింది. పంపింగ్ స్కీంతో పాటు అపార్ట్‌మెంట్ల వద్ద నిలిచిపోయిన మురుగునీరు కిందకు వెళ్లింది. రైతులు మాత్రం మురుగు నీరు వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని, కార్పొరేషన్ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయం చూసుకుని, పంట కాలువలో మురుగునీరు పారకుండా చూడాలని కోరుతున్నారు.


