చలపతి ఫార్మసీలో ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాం నందున్న చలపతి ఫార్మసీ కళాశాలలో అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మసీ (ఏబీఏపీ) సహకారంతో నిర్వహిస్తున్న ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ అంతర్జాతీయ సదస్సు (గ్లోబల్ కాన్ఫరెన్స్) మంగళవారం ప్రారంభమైంది. స్థిరమైన అభివృద్ధి కోసం హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ బయో మెడికల్ సైన్సెస్‌తో సాంకేతికత సమన్వయం అనే ప్రధాన అంశంతో మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ శాస్త్రవేత్తలు, అకడమిషీయన్లు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అరుదైన అవకాశాన్ని కల్పించిందని ఆయన తెలిపారు. కార్యక్రమానికి చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవి ఆంజనేయులు, సెక్రటరీ వై. సుజిత్‌కుమార్‌లు అధ్యక్షత వహించారు. ఏబీఏపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు.
● ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి మాట్లాడుతూ ఉన్నతవిద్య, పరిశోధన నాణ్యత, పరిశ్రమ అకాడమీ అనుసంధానం వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
● ఏఎన్‌యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధరరావు మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న పరిశోధనాధోరణులు, వైద్య శాస్త్రాల్లో సాంకేతికతపై విలువైన అవగాహన కల్పించారు.
● యూనివర్సిటీ ఆఫ్ అలబామా, ట్రాన్స్లేషనల్ సైన్స్ మెడిసిన్ విభాగం డాక్టర్ ఎం.ఎన్.వి.రవికుమార్ మాట్లాడుతూ ప్రయోగశాల స్థాయి పరిశోధనలు, వైద్య ఆవిష్కరణలుగా సమాజానికి ఉపయోగపడే విధానాన్ని వివరించారు.
● ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ నేసె శ్రీనివాసులు వ్యవసాయ పరిశోధనల్లో బయోటెక్నాలజీ పాత్ర, ఆహార భద్రత, సమగ్ర అభివృద్ధి అంశాలపై వివరించారు.
● హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ జి. నరహరిశాస్త్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర శాఖల పరిశోధనలు ఇన్నోవేషన్‌పై సమాచారాన్ని అందించారు.
● అలబామా స్టేట్ యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయాలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ మనోజ్ కె. మిశ్రా బయోమెడికల్ సైన్సెస్, గ్లోబల్ రీసెర్చ్ సహకారం యువ పరిశోధకులకు ఉన్న అవకాశాలను వివరించారు.
కార్యక్రమంలో దేశంలోని సుమారు 12 రాష్ట్రాలకు చెందిన 50కి పైగా ప్రముఖ విద్యాసంస్థల నుంచి 1250 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ అంతర్జాతీయ నిపుణులతో
ప్రారంభమైన గ్లోబల్ కాన్ఫరెన్స్


