80 లోనూ పతకాల పంట
తెనాలిటౌన్: రూరల్ మండలం కఠెవరం గ్రామానికి చెందిన ఆళ్ళ వీరారెడ్డి, సోమిశెట్టి బుల్లయ్య 80 సంవత్సరాల వయస్సులోనూ అథ్లెటిక్స్‌లో పాల్గొని మెడల్స్ సాధిస్తున్నారు. బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో 7వ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో జావెలెన్ త్రో, లాంగ్ జంప్, త్రో బాల్ పోటీలు 80 సంవత్సరాలు దాటిన వారికి నిర్వహించారు. కఠెవరం గ్రామానికి చెందిన ఆళ్ళ వీరారెడ్డి, సోమిశెట్టి బుల్లయ్య పాల్గొన్నారు.
● బుల్లయ్య జావెలెన్ త్రో, త్రోబాల్, లాంగ్ జంప్‌లో ప్రథమ బహుమతి సాధించగా, ఆళ్ళ వీరారెడ్డి షార్ట్‌ఫుట్‌లో ప్రథమ బహుమతి సాధించినట్లు చెప్పారు.
● చిన్ననాటి నుంచి క్రీడల్లో ఈ ఇరువురు ఉత్సాహంగా పాల్గొంటారని గ్రామస్తులు వివరించారు. ఈ సందర్భంగా ఇరువురుని సత్కరించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో లక్కరాజు శ్రీనివాసరావు, లక్కరాజు ఉమాకాంత్, కొల్లి ఉమాశంకర్‌రెడ్డి, పుట్టా రవికిషోర్, లక్కరాజు హరి, ఎం.నరేంద్ర, ఎస్.కోటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.


