రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో డివిజన్‌కు రజత పతకం
క్రీడాకారుడు శివరామకృష్ణ యాదవ్‌ను అభినందించిన డీఆర్‌ఎం
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈనెల 3వ తేదీ నుంచి 6 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌లో కమర్షియల్ క్లర్క్ కమ్ టిక్కెట్ క్లర్క్ ఎ.శివరామకృష్ణ యాదవ్ రజత పతకం దక్కించుకోవడం అభినందనీయం అని డివిజన్ డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో వెండి పతకం దక్కించుకున్న శివరామకృష్ణ యాదవ్‌ను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ తూర్పు కోస్ట్ రైల్వే, విశాఖపట్నంలో చాంపియన్‌షిప్ నిర్వహించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలకు చెందిన వెయిట్ లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొనగా 88 కిలలో విభాగంలో గుంటూరు డివిజన్‌కు చెందిన ఉద్యోగి శివరామకృష్ణ యాదవ్ వెండి పతకం కై వసం చేసుకోవడం అభినందనీయమన్నారు. డివిజన్ ఉద్యోగులు క్రీడల్లో చురుగ్గా పాల్గొని, డివిజన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాల్సిందిగా కోరారు.


