పేదలంటే చంద్రబాబుకు చిన్నచూపు
పేదలన్నా, పేద విద్యార్థులన్నా చంద్రబాబు చిన్న చూపుతో చూస్తున్నారు. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారు. పేదలకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగడం సిగ్గుచేటు. జగనన్న పేద విద్యార్థుల కోసం అనేక కళాశాలలను, విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. వాటన్నింటినీ చంద్రబాబు నాశనం చేస్తున్నారు. సంతకాల సేకరణ సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టమైంది. చంద్రబాబు సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
– షేక్ నూరి ఫాతిమా,
గుంటూరు తూర్పు నియోజకవర్గ
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త


