ప్రజా ఉద్యమం విజయవంతం
చంద్రబాబు నిరంకుశ పాలన, రూ.లక్షల కోట్ల అప్పులు, అందని ద్రాక్షగా సంక్షేమం, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులను ధారదత్తం చేస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజలు విసిగిపోయారు. అందుకే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు నియోజకవర్గంలో 72 వేల మందికిపైగా ప్రజలు కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తన వర్గానికి రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టేందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనించారు. బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు.
– బలసాని కిరణ్‌కుమార్,
ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త


