ప్రైవేటీకరణను సహించం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు. చంద్రబాబు సర్కార్ కమీషన్ల కోసమే ప్రైవేటీకరణకు యత్నిస్తోంది. నేడు ఉదయం 10 గంటలకు మంగళగిరి బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. గాలిగోపురం మీదుగా మిద్దె సెంటర్, గౌతమ బుద్ధ రోడ్, బీఎండబ్ల్యూ షోరూమ్ వరకు సాగుతుంది. అక్కడి నుండి గుంటూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి ర్యాలీ చేరుకుంటుంది. అక్కడి నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వెళుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలి.
– దొంతిరెడ్డి వేమారెడ్డి,
మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త


