సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ప్రభుత్వం నిర్వహించాల్సిన వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వారికి, కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఈ విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ప్రకారం కోటి సంతకాల సేకరణలో ప్రతి నియోజకవర్గంలోనూ వేల మంది ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేయటం ఇందుకు నిదర్శనం. జిల్లా కేంద్రం నుంచి సంతకాల పత్రాలను రాష్ట్ర పార్టీ ఆఫీసుకు తరలించే ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని జయప్రదం చేయాలి.
– అన్నాబత్తుని శివకుమార్,
తెనాలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయటం వలన అన్నివర్గాల విద్యార్ధులకు అపార నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా రిజర్వేషన్‌లు, ప్రతిభతో ముందుకు సాగే విద్యార్థులకు ఇదోక శాపంలాంటి నిర్ణయం. కేవలం దోచుకో, దండుకో, దాచుకో అనే సిద్ధాంతంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. వైఎస్ జగనన్న నేతృత్వంలో కచ్చితంగా ఎంతటి ఉద్యమాలకై నా వెనుకాడం. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ ఆలోచనను విరమించుకునే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం కొనసాగిస్తాం.
– షేక్ నూరి ఫాతిమా, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు,
గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త
చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ ద్వారా పేదలకు, వైద్య విద్య అభ్యసించే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేద, బడుగు బలహీన వర్గాల కోసం 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలల ప్రైవేటీకరణకు ప్రయత్నించడం దారుణం. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు పొన్నూరు నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. సోమవారం ఉదయం గుంటూరులో జరిగే భారీ ర్యాలీకి అందరూ భారీగా తరలిరావాలి.
– అంబటి మురళీకృష్ణ ,
పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


