ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
నగరంపాలెం: జిల్లాలో ఈవ్‌టీజింగ్‌పై 332 మందికి అవగాహన కల్పించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రహదారులపై అనవసరంగా సంచరిస్తున్న కొందరి ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌ను సహించేదిలేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. జిల్లాలోని బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, వ్యాపార కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక గస్తీ, ఆకస్మిక తనిఖీలు చేపట్టారని అన్నారు. ఈవ్‌టీజింగ్‌పై విద్యార్థులు, ప్రజలకు పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించారని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలు, ఆడపిల్లల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శక్తి బృందాలు, ప్రత్యేక పోలీస్ బృందాలు, నిఘా వర్గాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు.
తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో 10 మంది స్క్రబ్ టైఫస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన మహిళ, కొల్లూరు మండలం క్రాప, పొన్నూరు, దుగ్గిరాల, తెనాలి ఐతానగర్, కొల్లిపర, కొల్లూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరందరికి వ్యాధి నిర్ధారణ కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో గర్భిణి ఉన్నారు. వీరికి ఎటువంటి ప్రమాదం లేదని సీనియర్ ఫిజిషియర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు డివిజన్ పీఆర్‌ఓ వినయ్‌కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ – కాకినాడ టౌన్ (07264), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), సికింద్రాబాద్ – నరసాపూర్ (07239) రైళ్లు జనవరి 9వ తేదీన, వికారాబాద్ – నరసాపూర్ (07211) జనవరి 10న, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07280), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), వికారాబాద్ – నరసాపూర్ (07249) రైళ్లు జనవరి 11న, వికారాబాద్ – నరసాపూర్ (07211), వికారాబాద్–నరసాపూర్(07253) జనవరి 12 వ తేదీన, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261) జనవరి 13న కేటాయించినట్లు తెలిపారు. కాకినాడ టౌన్ – వికారాబాద్( 07263) జనవరి 8న, నరసాపూర్–వికారాబాద్ (07250) జనవరి 9న, కాకినాడ టౌన్ –సికింద్రాబాద్ (07279), కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07262), నరసాపూర్ – వికారాబాద్ (07248) రైలు జనవరి 10న, నరసాపూర్ – వికారాబాద్ (07250) జనవరి 11న, కాకినాడ టౌన్ –వికారాబాద్(07262), నరసాపూర్–వికారాబాద్ (07248) జనవరి 12న, నరసాపూర్–వికారాబాద్ (07257), కాకినాడ టౌన్–వికారాబాద్ (07241) రైలు జనవరి 17న, నరసాపూర్–వికారాబాద్ (07259) రైలు జనవరి 18న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07285) రైలు జనవరి 19న గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.
తెనాలిఅర్బన్: దళితుడుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు డిమాండ్ చేశారు. చుండూరు మండలం వలివేరు దళితవాడకు చెందిన పందిపాటి రెడ్డియ్యపై దాడికి నిరసనగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ముందుగా బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
నగరంపాలెం: గుంటూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్)ను అనివార్య కారణాలతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీఓ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జిల్లాలోని ప్రజలు గమనించి, జిల్లా పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు


