అన్ని వర్గాల నుంచి స్పందన
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి ఊహించని స్థాయిలో భారీ మద్దతు లభించింది. ప్రజల్లో తిరుగుతుంటే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోంది. పేదవాడికి వైద్యం, వైద్య విద్యను దూరం చేసి కార్పొరేట్ వారికి ఆసుపత్రులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్రలకు తెరలేపారని ప్రజలకు తెలిసిపోయింది. ఇకనైనా బాబు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోవాలి.పేదలకు న్యాయం చేయాలి. లేకుంటే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి.
– వనమా బాల వజ్రబాబు,
తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త


