7న ఆచార్య ఎన్‌జీ రంగా జయంతి
పొన్నూరు: భారత రైతాంగ నేత, పద్మవిభూషణ్ ఆచార్య ఎన్‌జీ. రంగా 125వ జయంతి వేడుకలు ఈనెల 7వ తేదీన లాంలోని ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు రంగా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నిడుబ్రోలులోని రంగా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమాల్లో రంగా జీవిత చరిత్ర ఫొటో ఎగ్జిబిషన్, వ్యవసాయ పరికరాల ప్రదర్శన ఉంటుందన్నా రు. సమావేశంలో సభ్యులు రామినేని కిషోర్‌బాబు, డాక్టర్ సజ్జా హేమలత, బొద్దులూరి రంగారావు, ఆకుల జానకిబాబు, షేక్ యాసిన్‌బాబా, గురుబాలు పాల్గొన్నారు.
పోలేరమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్ట
నూజెండ్ల: కొత్త జడ్డావారిపాలెంలో శ్రీ పోలేరమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ నుంచి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతున్నట్లు కమిటీ పెద్దలు తెలిపారు. గ్రామస్తులు రూ.70 లక్షల విరాళాలతో గుడి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రతిష్టా కార్యక్రమానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని పొంగళ్ళు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సతీమణి ఆదిలక్ష్మి, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పారా లక్ష్మయ్య తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
పోలీసుల క్యాండిల్ ర్యాలీ
నరసరావుపేటరూరల్:అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా పోలీసులు శుక్రవారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా జిల్లా పోలీ సు కార్యాలయం నుంచి ఏరియా ఆసుపత్రి వర కు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏఆర్ డీఎస్పీ జి.మహాత్మగాంధీరెడ్డి, అధికారులు పాల్గొన్నా రు. ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయ స్సుకు అహర్నిశలు పోరాడి అమరులైన పోలీసు ల త్యాగానికి జోహార్లు అర్పించారు. దేశ భద్ర త, సమాజరక్షణ కోసం అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని తెలిపారు.
విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు
గుంటూరురూరల్: దాసరిపాలెం గ్రామంలో జిల్లా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ ఽఅధికారులు సంయుక్తంగా శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. వడ్డే వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి చెందిన విజయశ్రీ బిల్డింగ్ మెటీరియల్ వాణిజ్య సముదాయంలో తనిఖీలు నిర్వహించారు. గృహ అవసరాల నిమిత్తం వినియోగించే 29 గ్యాస్ సిలిండర్లను చట్ట విరుద్ధంగా చిన్న చిన్న సిలిండర్స్‌లోకి రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. షాప్‌లో ఉన్న 29 డొమెస్టిక్ సిలిండర్లు, ఒక మోటార్ స్వాధీనం చేసుకున్నారు. కేసును స్థానిక సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రావుకి అప్పగించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీఐ కె.చంద్రశేఖర్, లక్ష్మీమాధవి, మండల సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటరావు పాల్గొన్నారు.
నేడు ఆరవ కోటి దీపోత్సవం
పిడుగురాళ్లరూరల్:కార్తిక మాసం సందర్భంగా బ్రాహ్మణపల్లి గ్రామంలోని శ్రీగంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆరవ కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బ్రహ్మశ్రీ యద్దనపూడి బ్రహ్మానందచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
7న ఆచార్య ఎన్‌జీ రంగా జయంతి
7న ఆచార్య ఎన్‌జీ రంగా జయంతి
7న ఆచార్య ఎన్‌జీ రంగా జయంతి


