వల్లకాడుకు వెళ్లలేక..
ప్రత్తిపాడు: వల్లకాడుకు వెళ్లలేక.. వెళ్లే దారి బురదమయం కావడంతో ఇదిగో ఇలా రోడ్డు పక్కనే దహన సంస్కారాలను నిర్వహించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మోంథా తుపాను ప్రభావంతో వంగిపురం పొలాలను వరద నీరు ముంచెత్తింది. పొలాలకు సమీపంలోనే ఉన్న శ్మశాన వాటికకు వెళ్లే దారి లేకపోవడంతో గ్రామంలో గురువారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించిన ఓ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు శుక్రవారం శ్మశాన వాటికకు చేరువ వరకు తీసుకువచ్చారు. కొద్ది దూరంలో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లే దారి అంతా బురదగా ఉండటంతో వంగిపురం–తిమ్మాపురం వెళ్లే మట్టి రోడ్డు పక్కనే కట్టెలు పేర్చి అక్కడే చితికి నిప్పు అంటించి దహన సంస్కారాలను
ముగించారు.


