 
															గుంటూరు
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
7
నగరంపాలెం: స్థానిక మారుతీనగర్ శ్రీకంచి కామకోటి పీఠం శ్రీమారుతీ దేవాలయ ఆవరణలో కార్తిక మహోత్సవాల్లో భాగంగా శ్రీగౌరీశంకర స్వామి వారికి గురువారం మధ్యాహ్నం సహస్ర మృత్తికా లింగార్చన నిర్వహించారు.
చిలకలూరిపేట టౌన్: డాక్టర్ గేయానంద్ రచించిన ‘పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు’ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. కొల్లా రాజమోహన్‌రావు పాల్గొన్నారు.
వేమూరు(వేమూరు): జాతీయ త్రోబాల్ పోటీల్లో అమర్తలూరు మండలం పెదపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని తెనాలి తేజస్విని కాంస్య పతకం సాధించింది. టీచర్లు అభినందించారు.
భారీ వరదతో నిండిన నల్లమడ వాగుకు ఇరువైపులా ప్రవాహ ఉద్ధృతి
నల్లమడ వాగు ఉగ్రరూపం దాల్చింది. మోంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆయా వాగుల ద్వారా వరద ప్రవాహం భారీగా రావడంతో నీరు పంట పొలాలను ముంచెత్తింది. గ్రామాలను నీరు చుట్టు ముట్టేసింది. స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. – ప్రత్తిపాడు
 
							గుంటూరు
 
							గుంటూరు
 
							గుంటూరు
 
							గుంటూరు
 
							గుంటూరు
 
							గుంటూరు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
