 
															పంటలన్నీ మునక
అప్పాపురం సమీపంలో కొమ్మమూరు కాలువ, నల్లమడ వాగు కలుస్తాయి. ఇక్కడ ఒక వాగు ఎగువ నుంచి, మరొక వాగు దిగువ నుంచి వెళ్లాలి. ఆయా మార్గాలు పూడికతో నిండిపోవడంతోపాటు ఓవర్ ఫ్లో పెరగడంతో నీరు వెనక్కు ఎగదన్నింది. అప్పాపురం వద్ద ఓవర్ ఫ్లో అయింది. దీంతో అప్పాపురం, కొండపాటూరు, గార్లపాడు గ్రామాల్లో సాగులో ఉన్న సుమారు ఐదు వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. శుక్రవారం రాత్రి వరకు వాగులో వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇదే నల్లమడ వాగుకు బాపట్ల జిల్లా చెరుకూరు వద్ద కూడా గండి పడినట్లు సమాచారం.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
