అడుగడుగునా గోతులే..!
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు రోడ్డు ఎక్కాలంటేనే వణుకు పుడుతోంది. అడుగు తీసి అడుగు వేస్తే చాలు భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి. కాస్త దూరం ప్రయాణం చేసినా ఒళ్లు హూనం అవుతోంది. వాహనాలు మొరాయిస్తున్నాయి. వాటికి రూ. వేలు ఖర్చు చేసి మరీ మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులే కాకుండా.. మారుమూల దారుల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. కొన్ని మార్గాల్లో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. తరచూ ప్రమాదాల బారిన పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. వానాకాలం కావడంతో భారీ గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.
– సాక్షి నెట్‌వర్క్


