
‘చలపతి’లో చదరంగం పోటీలు ప్రారంభం
ప్రత్తిపాడు: గుంటూరు రూరల్ మండలం లాంలోని చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో శనివారం ఆల్ ఇండియా అండర్–19 చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. పోటీలను చలపతి కళాశాల ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు, శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ డైరెక్టర్ ఎం. గోపీనాథ్ ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిసా రాష్ట్రాలకు చెందిన 220 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు ఆయా రాష్ట్రాల క్రీడాకారులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉత్సాహంగా చదరంగం ఆడారు. మొదటి రోజు విజేతలుగా నిలిచిన వారికి చలపతి విద్యా సంస్థల చైర్మన్ వై.వి. ఆంజనేయులు, ప్రిన్సిపాల్ ఎన్. రామారావు, గోపీనాథ్ నగదు బహుమతులు, షీల్డ్‌లు అందించి, అభినందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో చెస్ టోర్నమెంట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు రూ.1.20 లక్షల వరకు నగదు బహుమతులు అందించనున్నట్లు ఆయన చెప్పారు.