
అదుపులోకి వస్తున్న శాంతి భద్రతలు
● వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నానికి ఉపయోగించిన కారు స్వాధీనం ● కేసానుపల్లిలో పోలీసు కవాతు ● వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు పథక రచన ● జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్ ● బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
పల్నాడులో తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఆగడం లేదు. వైఎస్సార్ సీపీ నేతలు లక్ష్యంగా దాడులు చేసేందుకు వ్యూహరచనలు చేస్తూనే ఉంది. దీంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ కె.సాంబశివరావుపై హత్యాయత్నం సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో టీడీపీ వర్గీయులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 144 సెక్షన్ గురువారం కూడా కొనసాగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. గ్రామాల్లో కవాతు నిర్వహించి ప్రజల్లో ధైర్యం నెలకొల్పుతున్నారు. – సాక్షి నెట్‌వర్క్
రెండవ రోజూ 144 సెక్షన్ అమలు
పల్నాట
భయం.. భయం
కారెంపూడి: మండలంలో శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా 144 సెక్షన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేశారు. కారెంపూడిలోని ప్రధాన కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేస్తున్నారు. పోలీసు అధికారుల బృందాలు సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలసి మండలంలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం గంట సమయం మాత్రమే దుకాణాలు తెరిచారు. ఆ సమయంలో ప్రజలు అవసరమైన నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత మళ్లీ షాపులన్నింటిని వ్యాపారులు మూసివేశారు. ముగ్గురు కంటే ఎక్కువ మంది కన్పించకుండా భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర సమయంలో తప్ప ఎవరూ బయటకు రాలేదు. పోలీస్ శాఖ చర్యలతో ఉద్రిక్తతలు కూడా తగ్గుముఖం పట్టాయి. దౌర్జన్యాలు, దాడులకు పాల్పడిన వారు గ్రామాలు వదలి పారిపోయారు. ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ ఎప్పటికప్పుడు పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాధారణ పౌర జీవనం పునరుద్ధరణ జరిగేలా ఎస్పీ జి బిందుమాధవ్ ఆధ్వర్యంలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐల పర్యవేక్షణలో వందలాది పోలీస్, పారా మిలటరీ బలగాలు శ్రమిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా సామూహిక దాడులతో కారెంపూడి తీవ్రంగా కలవర పడిన నేపథ్యంలో పరిస్థితిని అధికారులు చక్కదిద్దుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు దాడులకు పాల్పడి ఆస్తి నష్టాలకు పాల్పడిన వారిని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని గుర్తించి పట్టుకుని అరెస్టు చేసేందుకు పోలీస్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

అదుపులోకి వస్తున్న శాంతి భద్రతలు