
సత్కార గ్రహీతలతో ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్
పాత గుంటూరు: ప్రజాసేవయే ధ్యేయంగా రామ్‌కీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తెలిపారు. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కళా దర్బార్ సాంస్కృతిక సంస్థ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, మహాదాత ఆళ్ల దశరథరామిరెడ్డి స్మారక ప్రతిభా పురస్కారాల ప్రదాన సభ నిర్వహించారు. సభకు కళాదర్బార్ వ్యవస్థాపకులు పొత్తూరి రంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ అయోధ్య రామిరెడ్డి పాల్గొని, జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినీ నటి సుధకు మహానటి సావిత్రి పురస్కారం, గాయకులు చంద్రతేజ, ప్రవీణ్ కుమార్, చాట్రగడ్డ శ్రీనివాసులు, సత్యానంద్, శైలజ, మాధవి, ఇందునైనాలకు ప్రతిభా పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు. ముందుగా జరిగిన సినీ సంగీత విభావరిలో గాయకులు హేమమాలిని, జ్యోతిర్మయి, వీర రాఘవరావు, సాంబశివరావు పాటల్ని ఆలపించి అలరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు.
ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి