
ప్రత్తిపాడు: జెడ్పీ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో సుమారు 30.63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జెడ్పీ మంచినీటి చెరువును మంగళవారం జెడ్పీ అధికారులతో కలసి మండలస్థాయి జెడ్పీ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు పరిశీలించారు. మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉంది? ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా? పరిరక్షణకు ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవలసి ఉన్నదీ అనే విషయాలు పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ ఏవో మాట్లాడు తూ గ్రామాల్లో ఉన్న జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ఆక్రమణలకు గురైతే తొలుత మండల కమిటీ దృష్టికి తీసుకురావాలని, అప్పటికీ పరిష్కారం కాకుంటే ఇల్లా కమిటీ దృష్టికి తీసుకు రావాలన్నారు. వెంట జెడ్పీ ఆస్తుల మండల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎంపీడీవో శ్రీరమ్య, కో కన్వీనర్ జెడ్పీటీసీ విప్పాల కృష్ణా రెడ్డి, సభ్యులు తహసీల్దార్ సంజీవ కుమారి, పీఆర్ ఏఈ కిషోర్ బాబు, మండల సర్వేయర్ టి.శ్రీనివాసరావు, దాసరి చెంచు రామారావు, జెడ్పీ జూనియర్ అసిస్టెంట్ బి మురళికృష్ణ తదితరులున్నారు.
జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు