
కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీబీఈఏ) ఆధ్వర్యంలో వైఎస్సార్‌టీయూసీ 12వ ఆవిర్భావ దినోత్సవం బ్రాడీపేటలోని సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించారు. జీడీసీసీ బ్యాంక్ సీఈఓ టి.కృష్ణవేణి వైఎస్సార్‌టీయూసీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏపీసీబీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ సహకార రంగ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సహకార ఉద్యోగులకు 62 సంవత్సరాలు పెంచటం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదన్నారు. త్వరలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వివరించి వినతిపత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆవుల సుందరెడ్డి, జీడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా వైఎస్సార్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం