దుర్గి: మించాలపాడు గ్రామంలో భార్యాభర్తల మధ్య వివాదంలో భార్య మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఎర్రగోల వెంకటరావమ్మ (50) మృతి చెందింది. భర్త హనుమయ్య మృతురాలు వెంకటరావమ్మ మధ్య ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో హనుమయ్య గాయపరచడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి ఐదుగురు సంతానం. కుమారులు అందరూ వివాహాలు చేసుకుని ఎవరికి వారే విడివిడిగా జీవిస్తున్నారు. మృతురాలి స్వస్థలం గురజాల మండలం అంబాపురం. కుటుంబ సభ్యు లు, మృతురాలి తమ్ముడు జిలుగు వీరయ్య స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.