
వండర్‌బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధుల నుంచిసర్టిఫికెట్లు అందుకుంటున్న దృశ్యం
యడ్లపాడు: సృజనాత్మకతకు పట్టం కట్టారు. కాలీగ్రఫీ రైటింగ్‌తో పాటు అందులో విభిన్న డిజైనింగ్ విభాగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులోని యూపీ పాఠశాలలో హెచ్‌ఎం జి.శ్రీనివాసరావు, కాలీగ్రఫీ శిక్షకులు షేక్ జున్నుసాహెబ్, విద్యా వలంటీర్ షేక్ చాందినీ ఆధ్వర్యంలో కాలీగ్రఫీ రైటింగ్‌తో పాటు అందులో విభిన్న డిజైనింగ్ విభాగంపై నెలరోజులు శిక్షణ ఇచ్చారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు బాలబాలికలందరూ పాల్గొని నేర్చుకున్నారు. సోమవారం వండర్ బుక్ ఆఫ్ రికార్డు భారత ప్రతినిధి వంగ నరేంద్రగౌడ్, న్యాయనిర్ధేతగా అదే సంస్థ ప్రతినిధి గంగాధర్, నరసరావుపేట లిమ్రా కోచింగ్ సెంటర్ చైర్మన్
షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో విద్యార్థులు నైపుణ్యాలను ప్రదర్శించారు. విద్యార్థులందరికీ వైట్ చార్టులు పంపిణీ చేసి రెండు గంటల్లో కాలీగ్రఫీలో తాము నేర్చుకున్న విభిన్నతను రాసి చూపించాలని లక్ష్యం ఇచ్చారు. కేవలం గంటా 26 నిమిషాల్లోనే ఎవరికీ వారు సొంతంగా సృజనాత్మకంగా పేర్లు, డిజైన్లు వేసి అందులో రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు..
కాలీగ్రఫీ రైటింగ్, డిజైన్, కలరింగ్‌లో చూపిన ప్రతిభకు వండర్‌బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించినట్లు ప్రతినిధులు తెలిపారు. వెంటనే పాఠశాల హెచ్‌ఎం జి.శ్రీనివాసరావు, క్యాలీగ్రఫీ శిక్షకులు షేక్ జున్ను సాహెబ్, విద్యావలంటీర్ చాందినిలకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ సర్టిఫికెట్‌తో పాటు మెడల్స్, 2022 ఘనతల పుస్తకాన్ని అందజేశారు.
కొండవీడు యూపీ స్కూల్‌కు వండర్ బుక్ ఆఫ్ రికార్డు కాలీగ్రఫీ హ్యాండ్ రైటింగ్, డబల్‌పెన్సిల్, డిజైన్ ఇన్ కలర్స్ విభాగాల్లో ప్రదర్శన ప్రదర్శనకు హాజరైన వండర్‌బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్లతో పాటు మెడల్స్, పుస్తకాలు అందజేత