సంచలనం కోసం శ్రీదేవి ప్రాణహాని వ్యాఖ్యలు | - | Sakshi
Sakshi News home page

సంచలనం కోసం శ్రీదేవి ప్రాణహాని వ్యాఖ్యలు

Mar 28 2023 1:20 AM | Updated on Mar 28 2023 1:20 AM

మాట్లాడుతున్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌   - Sakshi

మాట్లాడుతున్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌

తాడికొండ: మీడియా సంచలనం కోసం ఉండవల్లి శ్రీదేవి తనకు ప్రాణహాని ఉందనే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, సజ్జల గారికి నీతో ఏంపని, ఆయన స్థాయి ఏంటి మనస్థాయి ఏంటని ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. సోమవారం గుంటూ రు జిల్లా తుళ్ళూరు మండలం వెంకట పాలెం టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడారు.

ఉండవల్లి శ్రీదేవి అనవసరమైన ప్రేలాపనలు మాట్లాడకుండా తనపని తాను చూసుకుని కార్యక్రమా లు చేసుకోవాలన్నారు. ఆమె ఎవరితో పని చేయాలనుకుంటే వారితో పనిచేయవచ్చని, అమరావతి రైతుల కోసం పనిచేస్తానంటే చెయవచ్చని, అమరావతి రైతులకు తాము కూడా వ్యతిరేకం కాదని వారికోసం తాము పని చేస్తున్నామన్నారు. రాజకీయంగా ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలకు తాము వ్యతిరేకమని, అనవసరమైన ఆరోపణలు చేసి ప్రజల్లో పలచన కావద్దని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు ద్వారా ఎదుగుదామనుకోవడం తప్పని, ఆమె ఎంచుకున్న మార్గంలో ప్రత్యేకంగా వెళ్లిపోతే తప్పులేదు కానీ, అనవసరంగా వ్యక్తులను నిందిస్తూ సజ్జల గారిపై ప్రాణహాని వ్యాఖ్యలు చేయ డం వలన పత్రికల్లో ఓ రోజు పబ్లిసిటీ వస్తుంది తప్ప ప్రయోజనం ఉండదన్నారు. ఆమెకు ఎలాంటి ప్రాణభయం లేదని, అన్ని రక్షణ వ్యవస్థలు అనుకూలంగా ఉంటాయని, తాము కూడా వ్యక్తిగతంగా ఏమీ జరగకుండా చూస్తామని, ఆమె పనులు ఆమె చూసుకోవచ్చన్నారు.

ఎమ్మెల్సీ, మాజీ మంత్రి

డొక్కా మాణిక్య వరప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement