
సమస్య వింటున్న జిల్లా ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్, పక్కన ఏఎస్పీ శ్రీనివాసరావు
● నిర్ణీత వేళల్లో బాధితులకు న్యాయం చేయండి ● ఎస్పీ ఆరిఫ్ హఫీజ్
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక–స్పందన (గ్రీవెన్స్) జరిగింది. అర్జీదారుల సమస్యలను జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ అలకించారు. స్పందనలో వచ్చే సమస్యలపై సకాలంలో స్పందించాలని ఎస్పీ అన్నారు. చట్ట పరిధిలో అర్జీలకు ప్రాధాన్యత కల్పించి, నిర్ణీత వేళల్లో బాధితులకు న్యాయం అందించేలా చూడాలని చెప్పారు. ఈ మేరకు జూమ్ ద్వారా జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడారు. ఏఎస్పీ ఎ.శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రకాష్‌బాబు (క్రైం) ఆర్జీలు స్వీకరించారు.