
తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
●శ్రీదేవి రాజకీయాలకు అనర్హురాలు ● నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి శ్రీదేవి నీతులు వల్లించడం సిగ్గుచేటు ● వైఎస్సార్ సీపీ నాయకులు
తాడికొండ: ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చతెచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజకీయాలకు అనర్హురాలని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. తాడికొండ మండలం లాం గ్రామంలోని ప్రధాన కూడలిలో శ్రీదేవి దిష్టిబొమ్మను దహనం చేసిన పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పార్టీని అడ్డుపెట్టుకొని భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అంగన్‌వాడీ ఆయా మొదలుకొని నామినేటెడ్ పోస్టులను అమ్ముకొని భారీ అవినీతికి పాల్పడిన ఆమె మీడియాలో దళిత కార్డు అడ్డుపెట్టుకొని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నాలుగు సంవత్సరాలు వైఎస్సార్ సీపీ పాలనలో అధికారం అనుభవించి చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పార్టీని వీడిని ఆమెకు నిజంగా ప్రజల మద్దతు ఉంటే నియోజకవర్గానికి వచ్చి ప్రజాసేవ చేస్తే బండారం బయట పడుతుందన్నారు. నిన్న మొన్నటి వరకు అమరావతి రైతుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రత్యేక పోలీసు వాహనాన్ని పెట్టుకొని తిరిగిన ఎమ్మెల్యే శ్రీదేవి ఇప్పుడు అమరావతి ఉద్యమంలో పాల్గొంటామనడం ఆమె అవినీతి పరాకాష్టకు చేరిందనేందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ దాస రి రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్ మీర్జావలి, నూర్జహాన్, రావూరి నరేష్, దాసరి ప్రకాశం, భాగ్యారావు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
దిష్టిబొమ్మ దహనం
ఫిరంగిపురం: వుుఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం సాయంత్రం సొలసబస్టాండ్ సెంటర్లో వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన తెలిపారు. జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మ మాట్లాడుతూ అవినీతి రాజకీయాలు చేసింది శ్రీదేవేనని ధ్వజమెత్తారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు మార్పుల శివరామిరెడ్డి, వైస్ ఎంపీపీ డి.చంద్రం, కె.చిన్నప్పరెడ్డి, చిట్టా అంజిరెడ్డి, పి.జేమ్స్ ఇన్న య్య, బి.అంజిరెడ్డి, పాలపాటి రఘు, హేమలత, పి.చిన్న,డి.నరేంద్రకుమార్, పి.జోసఫ్, సీహెచ్ రామమోహన్‌రెడ్డి, మీరా, పిచ్చిరెడ్డి, రంజన్‌బాబు, ఇజ్రాయిల్, రత్నబాబు, టి.డేవిడ్ , వి.రాము, చిన్నయ్య, జోసఫ్, కె.రామారావు పాల్గొన్నారు.

ఫిరంగిపురంలో ఎమ్మెల్యే శ్రీదేవి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు