గత నాలుగేళ్లుగా ఆటోనగర్ ఫేజు–2లో పాత ఇనుప వ్యాపారం చేస్తున్నా. శ్రీపుట్టపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు సుమారు నెలక్రితం పరిచయమై, మరోకర్ని పరిచయం చేశారు. అతని వద్ద ఐరన్ ఉందని చెప్పారు. దీంతో 50 వేల కిలోల ఐరన్ సరఫరా చేస్తామని ఈ ఏడాది జనవరి 25న ఒప్పందమైంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.38 లక్షలు పంపించా. విడిగా రూ.5 లక్షలు చెల్లించా. లారీల్లో ఐరన్ పంపిస్తున్నట్లు నమ్మబలికారు. తర్వాత లారీల్లో ఆయిల్ అయిపోయిందని చెప్పగా, రూ.70 వేలు ఫోన్‌పే చేశాను. అయితే ఇప్పటి వరకు సరుకు అందలేదు. అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.. – మీర్ మహమ్మద్ అలీ,
శాంతినగరం, చిట్యాల, నల్గొండ జిల్లా.